విజయానికి బావుటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాటపర్రు నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఉద్దండులు తక్కువేం కాదు. నిర్మాతలున్నారు. దర్శకులున్నారు. నటులున్నారు. సాంకేతిక నిపుణులున్నారు. ట్వెంటీ ఫోర్ క్రాఫ్ట్స్‌లోని అతి ముఖ్యమైన విభాగాలన్నింటిలో చాటపర్రు పాత్ర ఉండే తీరుతుంది. అయతే, ఎక్కువ శాతం వన్ ఇన్ వన్‌లే అయతే -ఇదిగో ఇలా విజయ బాపినీడులాంటి వాళ్లు మాత్రం త్రీ ఇన్ వన్‌లు, ఆల్ ఇన్ వన్‌లుగా కనిపిస్తారు. రచయతగా/ నిర్మాతగా/ దర్శకుడిగా తన సక్సెస్‌ను చేతల్లో చూపించిన మనిషి -గుత్తా బాపినీడు చౌదరి.

ఏలూరు తాలూకా చాటపర్రు గ్రామం నుంచి చటర్జీ, ముఖర్జీ, రవీంద్రనాథ్ చౌదరివంటి నిర్మాతలు వచ్చారు. గుత్తా రామినీడు, గుత్తా రాంసురేష్ వంటి దర్శకులు వచ్చారు. మురళీమోహన్ వంటి ఆర్టిస్టులూ సినీరంగంలో ప్రతిభను ప్రదర్శించారు. ఆ కోవకు చెందిన వ్యక్తి, అదే ఊరివాడు బాపినీడు. పూర్తి పేరు గుత్తా బాపినీడు చౌదరి. కళాశాల విద్య పూరె్తైన తరువాత పంచాయితీ రాజ్ శాఖలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేశారు. స్వతహాగా రచయిత కావడంతో కథలు, నవలలు వ్రాస్తూ ఆ రంగంలో రాణించాలనుకున్నారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి మద్రాసు చేరారు. అక్కడే -చందమామ తరహాలో బొమ్మరిల్లు అనే పిల్లల మాస పత్రిక ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో ‘రమణి’ పేరిట మరో పత్రిక నడిపారు. అది పాఠకలోకంలో సంచలనం సృష్టించింది. ఈ దశలోనే ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత కె రాఘవ ప్రోత్సాహంతో జగత్‌జెట్టీలు చిత్రానికి కథ సమకూర్చారు. తరువాత సుబ్బరాజు నిర్మించిన ‘హంతకులు- దేవాంతకులు’ చిత్రానికీ కథనిచ్చారు. ఇది జరిగింది 1970-71 ప్రాంతాల్లో. ఆ రోజుల్లోనే సినిమాలకు కథలు రాసే ఉద్దేశంతో మద్రాసు చేరిన నేను, కలవారి కుటుంబం చిత్రానికి రచన చేస్తూ తరచూ వారిని కలుస్తుండేవాడిని.
1974లో ప్రముఖ రాజకీయ నాయకుడు, బాపినీడుకు ఆత్మీయ మిత్రుడైన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించి తొలి చిత్రంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ చిత్రాన్ని నిర్మించారు. తరువాత ఆయన దగ్గర సహాయకునిగా పనిచేసిన దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘విజయ’, ‘బొట్టు- కాటుక’ చిత్రాలు నిర్మించారు. రాజాచంద్ర దర్శకత్వంలో ‘బొమ్మరిల్లు’, వౌళి దర్శకత్వంలో ‘పట్నంవచ్చిన పతివ్రతలు’ చిత్రాలను నిర్మించారు. దాంతో అటు రచయితగానూ, ఇటు నిర్మాతగానూ పలు శాఖల్లో అనుభవం, పట్టు సంపాదించారు బాపినీడు. 1983లో స్వీయ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ‘మగమహారాజు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ఉమ్మడి కుటుంబ విలువలు, అన్నదమ్ముల అనుబంధాలు, కుటుంబం కోసం హీరో సైకిల్ పందెంలో పాల్గొని గెలవటం వంటి సన్నివేశాలతో అత్యంత సహజంగా రూపొందించడంతో సినిమా ఘన విజయం సాధించింది. కథలో కీలకమైన పాత్రకు కన్నడ నటుడు ఉదయ్‌కుమార్‌ను ఎంపిక చేయడంతో కొత్తదనం కనబడింది. తరువాత చిరంజీవి కథానాయకుడిగా ‘హీరో’, ‘మహానగరంలో మాయగాడు’, ‘మగధీరుడు’, ‘ఖైదీ నెం 786’, ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రాలను విజయవంతంగా తీర్చిదిద్దారు. గ్యాంగ్‌లీడర్ చిత్రం ద్వారా గీత రచయిత భువనచంద్రను సినీరంగానికి పరియం చేశారు. ఆ సినిమాలో ‘వానా వానా వెల్లువాయే’, ‘సండే అననురా మండే అననురా’ గీతాలను అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించారు.
‘మహారాజు’ చిత్రాన్ని -డబ్బున్న వారికంటే కుటుంబ బంధాలకు కట్టుబడిన పేదవాడే మహారాజు అనే కథాంశంతో చిత్రాన్ని రూపొందించారు. శోభన్‌బాబు, సుహాసిని కాంబినేషన్‌లో చిత్రీకరించిన ‘రాజువయ్యా మహరాజువయ్యా’ గీతం ఆర్ద్రత ఉట్టిపడేలా చిత్రీకరించారు.
పై చిత్రాలకు భిన్నంగా హాస్యానికి ప్రథమ తాంబూలమిచ్చి చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా రూపొందించిన ‘నాకూ పెళ్లాం కావాలి’ చిత్రం కూడా హిట్‌లిస్ట్‌లో చేరింది. 1956లో వచ్చిన ‘్భలేరాముడు’ చిత్రంలో రేలంగి ఉపయోగించిన ‘జూలకటక’ అనే ఊతపతాన్ని టైటిల్‌గా పెట్టి మరో హాస్య చిత్రం రూపొందించారు. సుమారుగా 25 చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఖాతాలో విజయాలే ఎక్కువగా నమోదు చేసుకున్నాయి. ఈనాటి నిర్మాణపు విలువలతో పోటీపడి పరిగెత్తలేక కొంతకాలంగా ఏలూరులో విశ్రాంతి తీసుకుంటున్న బాపినీడు -రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా త్రీ ఇన్ వన్ అనిపించుకున్న మహామనిషి.

-ఎస్‌వి రామారావు (గ్రేట్ డైరెక్టర్స్ సౌజన్యం)