జంగిల్‌బుక్‌కు తెలుగు కుర్రాడి డబ్బింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా చిన్నా పెద్దా తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్న ‘జంగిల్ బుక్’ తాజా చిత్రంలో ఓ తెలుగు కుర్రాడు తన ప్రతిభ చూపాడు. హైదరాబాద్‌కు చెందిన పదేళ్ల సంకల్ప్ సినిమాలోని ప్రధాన పాత్ర మోగ్లీకి డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలిసారి ఎలాంటి అనుభవం లేకుండా తెలుగు భాషలో చక్కగా మాట్లాడుతూ, వినేవారికి అతని వాక్పటిమ, శబ్దసంపద, అతని సంభాషణల శైలి వినేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆంగ్లభాష విద్యార్థులపై ప్రభావం చూపుతున్న నేటి పరిస్థితుల్లో తెలుగుభాషపై పట్టు సాధించి సంకల్ప్ చెప్పిన డబ్బింగ్ తీరు అందరినీ ఆకట్టుకుంటోందట. ఎంతో అనుభవం వుంటేగానీ ఇలా చెప్పడం కష్టమని పలువురు అతన్ని ప్రశంసించారు. ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ ఇంగ్లీషులో భాషలో రూపొందించింది. బిల్ ముర్రే, బెన్‌కింగ్‌స్లే, ఇంగ్రిస్ ఎల్బా, స్కార్లెట్ జాన్‌సన్ తదితరులు డబ్బింగ్ చెప్పారు. హిందీ వెర్షన్‌లో ప్రియాంక చోప్రాతోపాటు కొందరు బాలీవుడ్ ప్రముఖులు డబ్బింగ్ చెప్పడం విశేషం.