ఇచ్చిన మాట నిలబడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి. చేసిన ప్రతి పనీ కనబడాలి. ఇన్‌టైమ్ ఆన్ డోర్ -ఇదీ మహానాయకుడులో బాలయ్య టీజర్ డైలాగ్. యన్‌టిఆర్ బయోపిక్‌లోని మలిభాగం మహానాయకుడు టీజర్ విడుదలైంది. తొలి భాగం కథానాయకుడు అంత హడావుడి లేకుండానే రాజకీయ నేపథ్యంతో వస్తున్న రెండోపార్ట్ ‘మహానాయకుడు’ టీజర్ విడుదలైంది. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అన్న డైలాగ్‌ను యన్‌టిఆర్ పాత్ర పోషిస్తున్న బాలయ్య చెప్పడం ఆకట్టుకుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. యన్‌టిఆర్‌గా బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన కథానాయకుడు (యన్‌టిఆర్ సినీ జీవితం ఆధారంగా) సంక్రాంతి చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోభాగానికి పూర్తిగా హడావుడి తగ్గించారు. యన్‌టిఆర్ రాజకీయ జీవితం చుట్టూ అనేకానేక వివాదాలు ముసురుకుని ఉన్న నేపథ్యంలో -మహానాయకుడు కథను ఎలా చూపించనున్నారోనన్న ఆసక్తి ఆడియన్స్‌లో కనిపిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రాన్ని ఎన్‌బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.