కర్ణుడిగా చియాన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిని మించిపోయేలా తమ భాషలోనూ సినిమా ఉండాలన్న తాపత్రయం పరభాషల్లో మొదలైంది. ఆమధ్య విజయ్ పులితో, గత ఏడాది అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌తో చేసింది ఇలాంటి ప్రయత్నాలే. అయితే అవేవీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో బాహుబలి రికార్డ్స్ భద్రంగా ఉన్నాయి. అయితే ప్రయత్నాలకు మాత్రం చెక్ పడలేదు. తమిళ్‌తోపాటు దేశవ్యాప్తంగా ముఖ్య భాషలన్నింటిలో రాబోతున్న మహావీర్ కర్ణ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చియాన్ విక్రమ్ మొదటిసారి మహాభారత గాథలోని కర్ణుడి వేషం వేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందని టాక్. యునైటెడ్ ఫిలిం కింగ్‌డం నిర్మిస్తున్న మూవీకోసం వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ ఘట్టాలను షూట్ చేస్తున్నాడు దర్శకుడు ఆర్‌ఎస్ విమల్. మొత్తం 18రోజులపాటు భీకరమైన యుద్ధ సన్నివేశాలని తీయబోతున్నారట. విక్రమ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తరూపంలో చూడబోతున్నారని యూనిట్ చెబుతోంది.