అనుబంధాలకు అర్థం చెప్పే చుట్టాలబ్బాయి.... దర్శకుడు వీరభద్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనకు బాగా ముఖ్యమైన వాళ్ళను బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయాలంటే ఇతను మా చుట్టాలబ్బాయ్ అని పరిచయం చేస్తాం. అలా చుట్టాల తరఫునుండి వచ్చిన ఓ కుర్రాడు ఆ కుటుంబంలో అనుబంధాలను ఎలాంటి అర్థాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఒకటిగా కలిపాడు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుంది’ అని దర్శకుడు వీరభద్రమ్ తెలిపారు. ఆది, నమితా ప్రమోద్, యామిని మల్హోత్ర ప్రధాన తారాగణంగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట తలారి, రామూ తాళ్ళూరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పలు విశేషాలను తెలిపారు.

దర్శకుడు వీరభద్రమ్

సినిమా ప్రోగ్రెస్?
- దాదాపు 90 శాతం టాకీ పూర్తయింది. క్లైమాక్స్, మూడు పాటలు చిత్రీకరించాలి. అన్నీ పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

కథానాయకుడి పాత్ర?
- ఆది రికవరి బాబ్జి అనే పాత్రలో కనిపిస్తాడు. నేను అనుకున్నదానికన్నా ఈ పాత్రకు అతను యాప్ట్ అయి అందరికీ నచ్చేలా నటించాడు. ఇక హీరోయిన్ కోసం అనేకమందిని అనుకున్నా చివరికి నమితా ప్రమోద్‌ను ఎంపిక చేశాం. మలయాళంలో ఆమె 50 సినిమాలదాకా చేసింది.
టైటిల్ జస్ట్ఫికేషన్?
- మొత్తం సినిమా కుటుంబ నేపథ్యంలో అందంగా సాగుతుంది. ఓ చక్కని కుటుంబంలో చుట్టాలబ్బాయిగా వచ్చిన వ్యక్తి ఆ కుటుంబంలో అందరినీ ఏ విధంగా ఆకట్టుకుని వారిని సంస్కరించాడు అనే కథనంతో ఉంటుంది. ప్రేక్షకులు ఈ చిత్రంలో కథను ఎంజాయ్ చేస్తూ హాస్యాన్ని కూడా ఆస్వాదిస్తారు. సెంటిమెంట్ పుష్కలంగా వుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆది బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా ఫైట్లు, పాటలు, కామెడీ సన్నివేశాలు కలగలిపి చిత్రాన్ని రూపొందించాం.
హీరోనే దృష్టిలో పెట్టుకుని కథ రాశారా?
- నాకు నచ్చినట్లుగా ఓ కథ రాసుకుంటా. ఆ కథ ఎవరికి సూట్ అవుతుందా అని ఆలోచించి ఆ తరువాత స్టెప్ వేస్తా.‘చుట్టాలబ్బాయి’ కథ ఆదికి సరిపోతుందని అతనికి వినిపించాను. అతనికి నచ్చింది. అలా ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది.
ఆదికి, మీకు ఈమధ్య హిట్స్ లేవు కదా?
- ఆదికే కాకుండా నాకు కూడా ఈ సినిమా విజయం అత్యవసరం. అందుకే ఈ సినిమా కథనుండి ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినిమా రూపొందించాం. ప్రేక్షకులకు ప్రతి అంశం నచ్చేలా వంద శాతం సక్సెస్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రాసుకున్నా. తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం వుంది.
బర్త్‌డే స్పెషల్ ఏంటి?
- ఓ మంచి బంగారంలాంటి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుండడమే ఈ జన్మదినోత్సవ కానుకగా భావిస్తున్నాను. ‘అహనాపెళ్లంట’, ‘పూలరంగుడు’ చిత్రాల్లాగా ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిస్తుందన్న నమ్మకం ఉంది.
భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు తీస్తారు?
- కామెడీకి పెద్దపీట వేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను రూపొందించాలనే నా భావన. ఎన్నో టెన్షన్లతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటలపాటు నవ్వుకుని వెళ్లాలి. ప్రేక్షకులు రిలాక్స్ అయ్యే సినిమాలే తీయాలని కోరిక.

తరువాతి ప్రాజెక్టులు
- రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ‘చుట్టాలబ్బాయి’ విడుదల తరువాత ఆ సినిమాల గురించి చెబుతా. నా తరువాతి చిత్రం ఖచ్చితంగా ఓ పెద్ద హీరోతోనే ఉంటుంది.

- యు