కళాకారుడు శివుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఎస్‌ఆర్, టీవీ 9 అవార్డుల 5వ వార్షికోత్సవ ప్రదానోత్సవం విశాఖపట్నంలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా సాగింది. కార్యక్రమానికి ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాస్ రావు, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, విశాల్‌తోపాటు మరెందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ అభిమాన నటీనటులు, టెక్నీషియన్లను టీవీ9తో కలిసి సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ప్రజాసమక్షంలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించటం ఎక్కడా జరగదేమో. కళాకారుడు ఈశ్వరుడితో సమానం. వారిని సత్కరించటం ఈశ్వరుడిని గౌరవించటమే అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ సత్కారం ద్వారా కళాకారుడికి గలిగే ఆనందంలోని శక్తి తాను పొందుతానని భావించే మనిషి టిఎస్సార్. ఇంతమందిని ఒకే వేదికపైకి తీసుకురావడం బహుశ ఆయనకే చెల్లింది అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ కళాకారుడి హృదయంలో తనకు చోటుంటే చాలని భావించే వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని, ఆయన నిండు నూరేళ్లు ఆయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఏటా ఇలాంటి కర్యం నిర్వహించటం ఆషామాషీ కాదంటూనే, ఆయన అజాతశత్రువు, ఒక్క పిలుపునిస్తే చాలు అందరం హాజరవుతాం అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమంలో భాగస్తుడిని చేసినందుకు సుబ్బరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.