ఇక నిర్మాతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరిట విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడట. తనను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు షమీర్ దర్శకుడు. ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నోవేటివ్ కానె్సప్ట్‌తో చిత్రానికి రూపకల్పన చేశారని సమాచారం. పెళ్లిచూపులు చిత్రం ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించారు. వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యముంది. దీంతో ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందులో తరుణ్ భాస్కర్ లుక్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. దర్శకత్వంతోపాటు నటుడిగానూ రాణిస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఫలక్‌నుమా దాస్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు.