రానా మరోలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’లో భల్లాలదేవ. ‘ఘాజి’లో నేవీ ఆఫీసర్ అర్జున్. ‘నేనే రాజు నేనే మంత్రి’లో పొలిటీషియన్. ఒక్కో సినిమాలో ఒక్కో తరహా పాత్ర. వైవిధ్యంగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో దగ్గుబాటి రానా. ‘గృహం’వంటి హారర్ థ్రిల్లర్‌తో మెప్పించిన దర్శకుడు మిలింద్ రౌతో ఓ చేయబోతున్న కొత్త చిత్రం ఆగస్టులో మొదలుకానుంది. రజనీకాంత్ ‘్భషా’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను గోపీచంద్ ఆచంట నిర్మించనున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ‘్భషా’తో మా సంస్థ పరిచయమైంది. కొంత గ్యాప్ తర్వాత ఇదే బ్యానర్‌లో నయనతార సూపర్‌హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగల్’ను అంజలి సిబిఐగా అందిస్తున్నాం. ఇక తెలుగు సినిమాలను బ్యానర్‌లో నిర్మించాలన్న ఆలోచనతో రానాతో సినిమా చేయబోతున్నాం. ‘గృహం’వంటి హారర్ థ్రిల్లర్‌ను అందించిన మిలింద్ రౌ ఆ సినిమాకు దర్శకుడు. ఆగస్ట్‌లో సినిమా ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అందిస్తాం అన్నారు.