మూగవోయె మెగాఫోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు డిగ్రీ చేస్తే చూడాలనుందిరా -తండ్రి కోరిక
పట్ట్భద్రుడివై పరిశ్రమకు రా, చూసుకుంటా -గురువు పిలుపు
కళగా ఉంటావ్. ఆ కళను నిరూపించుకో -స్నేహితుల ప్రోత్సాహం.
కళ్లు మూస్తే -కనిపించే స్టేజీ. కళ్లు తెరిస్తే -చీకటిని మోసుకొచ్చే డేరా.
మనసునిండా -నాటకం. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ వెంటాడే కళారంగం.
తండ్రిని సంతృప్తిపర్చాడు -డిగ్రీ పూర్తి చేసి. గురువును గౌరవించాడు -పరిశ్రమకు వచ్చేసి. స్నేహితుల మాట నిలబెట్టాడు -ప్రతిభను ప్రదర్శించి. చివరిగా తనకుతాను సంతృప్తిపొందాడు -మెగాఫోన్ చేతబట్టి. అతనే -కోడి రామకృష్ణ.

నాటక రంగంనుంచి వచ్చిన ప్రతిభావంతులైన దర్శకుల్లో -కోడి రామకృష్ట కూడా. పుట్టింది పాలకొల్లులో. పెరిగింది లలిత కళాంజలి ‘కలా’వేదికపై. నిలిచింది -దర్శక మేరుపర్వతంపై. తుది శ్వాస విడిచింది -టాలీవుడ్ పరిశ్రమలో. ఎప్పటికీ ఉండేది -కోట్లాది అభిమానుల గుండెల్లో.
దర్శకుడిగా కోడి రామకృష్ణ తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. దిగ్గజ దర్శకుడు దాసరిని పరిచయం చేసిన నిర్మాత కె రాఘవే, ఆయన శిష్యుడైన రామకృష్ణకూ అవకాశమివ్వడం విశేషం. యన్‌టిఆర్ వినా ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో పని చేశారు. ఇండస్ట్రీలో కోడిది 30 ఏళ్ల ప్రస్థానం. టాలీవుడ్‌పడిన ఆయన అడుగులు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర రంగంవైపూ పయనించాయి. శత చిత్ర దర్శక చతుష్టయం (దాసరి, కెఎస్‌ఆర్ దాస్, కె రాఘవేంద్రరావు)లో కోడి రామకృష్ణ ఒకరు. ఎలా నటించాలో ఆర్టిస్టులకు చెబుతూనే నటుడయ్యాడు. ఆ సినిమా ‘మా ఇంటికి రండి’. సుహాసిని హీరోయిన్. తర్వాత కొద్ది సినిమాల్లో సహాయక పాత్రలూ చేశారు. ఆయన చేసిన చిత్రాలన్నీ ఆయన దర్శకత్వంలో వచ్చినవే. చిరంజీవితో -ఇంట్లోరామయ్య వీధిలో క్రిష్ణయ్య, ఆలయ శిఖరం, సింహపురి సింహం, గూఢచారి 117, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా నిలబెట్టిన ‘మంగమ్మగారి మనవడు’ కోడి చిత్రమే. తర్వాత బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు చేశారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాల్లో ఎక్కువ భాగం కోడి దర్శకత్వం వహించినవే. గొల్లపూడి మారుతీరావు, గణేష్‌పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంతో కొంతకాలం చిత్రాలు తీశారు. జనరేషన్‌కు తగ్గట్టుగా సాంకేతికతలో అప్‌డేట్ అయిన కోడి రామకృష్ణ ‘అమ్మోరు’తో మెరుపులు (గ్రాఫిక్స్) మెరిపించారు. ఆ కోణంలోనే దేవి, దేవీపుత్రుడు, దేవుళ్లు, అంజిలాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆ కోణంలో చూస్తే అరుంధతి -ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.
**
కోడి తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. రామకృష్ణ ప్రాథమిక విద్యనుంచి కళాశాల వరకూ పాలకొల్లులోనే సాగించారు. కాలేజీ రోజుల్లోనే చిత్ర కళను వృత్తిగా చేపట్టారు. పగలు చదువు. రాత్రి సమయాల్లో అజంతా పెయింటింగ్స్. ఆర్థిక స్వాతంత్య్రం కోసం -కమర్షియల్ ఆర్టిస్టుగా దుకాణాన్ని నడిపిన అనుభవం కోడిది. అప్పట్లో అక్కినేనిని అమితంగా ఇష్టపడే రామకృష్ణ -ఆయనతో ఫొటోలు దిగి అవకాశాల కోసం పలువురు దర్శకులకు పంపేవారు. ‘అరేయ్, నువ్వు డిగ్రీ చేస్తే చూడాలనుందిరా. ఆ తరువాత నీకేది చెయ్యాలనిపిస్తే ఆ పనే చేసుకో’ -ఆ టైంలో ఇదీ తండ్రి మాట. సినిమా ప్రయత్నాలకు కామాపెట్టి తండ్రి మాటను గౌరవించాడు. కోడి రామకృష్ణ పట్ట్భద్రుడయ్యాడు.
**
బాల్యం నుంచే రామకృష్ణకు నాటకాల పిచ్చి. కాదు -ప్రాణం. అందుకే ఆయన కాళ్లు నాటక సమాజాలవైపు నడిచేవి. కళ్లు, స్టేజివైపు రెప్పార్పకుండా చూసేవి. ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి -అది ముదిరిపోయింది. నాటకాల్లోకి దిగిపోయాడు. కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతోపాటు, టిక్కెట్టు నాటకాలూ ఆడేవాడు. అలా మద్రాసువైపు అడుగులు పడ్డాయి. అక్కడినుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్నీ తీసుకొచ్చేవారు. దాసరి నారాయణరావు తొలి సినిమా ‘తాత మనవడు’ విడుదలైన తరువాత -కోడి మనసు మనసులో లేదు. ‘దర్శకుడైపోయాలి. అవకాశమంటూ వస్తే దాసరి దగ్గరే పని చేయాలి’. ఇదీ -సంకల్పం. తన ఆశను దాసరికి చేరవేశాడు. డిగ్రీ పూర్తి చేస్తే చూద్దామన్న ఆశీర్వాదం దొరికింది. పట్ట్భద్రుడై నాన్న కోర్కెను తీర్చి, దాసరికి ఉత్తరం రాశాడు. ‘బయలుదేరు’ అంటూ దాసరి నుంచి టెలిగ్రాం వచ్చింది. ‘పిలుపొచ్చింది. చార్జీలెలా?’ ప్రశ్న తలెత్తింది. పల్లెపడుచు నాటకం గుర్తుకొచ్చింది. మిత్రుడి కోసం మిత్రులంతా నాటకమాడారు. ఆ డబ్బుతో మద్రాసు రైలెక్కాడు కోడి రామకృష్ణ.
**
అప్పటికి దాసరి బిజీ. ఒకేసారి రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించేంత బిజీ. గురువు బిజీ శిష్యుడికి కలిసొచ్చింది. ఆ టైంలో -ఎవరికివారే యమునాతీరే, స్వర్గం-నరకం, మనుషుల్లో దేవుడు -ఈ మూడు సినిమాలకు కోడి అసిస్టెంట్ అయిపోయాడు. గురువులాగే బిజీ అయిపోయాడు. దాసరి నటించిన పలు చిత్రాలకు దాసరే డైరెక్టర్. అప్పటికి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడికీ అదే ఆశ కలిగింది. అంతేకాదు, గురువును దర్శకుడిని చేసిన రాఘవ బ్యానర్‌లోనే తొలి సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్నాడు.
సంకల్పం బలమైనదేతే
-సమస్తం నీముందుంటుంది.
దాసరి- రాఘవ కాంబినేషన్‌లో వచ్చిన ‘తూర్పు-పడమర’ సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలోకి దూరాడు. ఆ తర్వాతే కోడి రామకృష్ణ దర్శకుడయ్యాడు. మంగమ్మగారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, ముద్దుల మావయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజి, దేవీపుత్రుడు, దేవి, దేవుళ్లు, అరుంధతిలాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి గురువు పేరు నిలబెట్టాడు. ప్రముఖ నటులు అర్జున్, భానుచందర్, సుమన్‌లను పరిశ్రమకు పరిచయం చేశాడు. నందులు, ఫిల్మ్‌ఫేర్లు దాటుకుని రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నాడు.
నటుడిగా..: దాసరివద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే సినిమాల్లో చిన్నా పెద్దా వేషాలేసేవాడు. స్వర్గం- నరకం చిత్రంలో అక్కినేని అభిమాన సంఘం నాయకునిగా స్క్రీన్‌పై కనిపించాడు రామకృష్ణ.
రాజశ్రీ దర్శకత్వంలో రాఘవ నిర్మాతగా తీసిన చదువు-సంస్కారం సినిమాలో విద్యార్థి నాయకుని పాత్రలో కనిపించాడు. మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకునే అవకాశమే కోడిలో పట్టుదల పెంచింది. ఇక దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగానూ ప్రయత్నించారు. తొలిసారిగా ‘మా ఇంటికి రండి’ చిత్రంలో హీరోగా చేశారు. సుహాసిని హీరోయిన్. అది సక్సెస్ కొట్టలేకపోవడంతో - సహాయ పాత్రలకే పరిమితమయ్యాడు కోడి రామకృష్ణ.