వన్ బోయ్.. వన్ గాళ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్ లైఫ్‌లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ -రీల్ లైఫ్‌లోనూ ఒరిజినల్ ఎక్స్‌ప్రెషనే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. అదీ -రియల్ లైఫ్‌లోని వైఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ. ఈ ఎక్స్‌ప్రెషన్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదూ. క్లారిటీగా చెప్పాలంటే -అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘మజిలీ’. సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు. షైన్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గోపీ సందర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన సినిమాలోని తొలి పాటను ట్విటర్ వేదికగా చైతూ సోషల్ మీడియాకు షేర్ చేశాడు. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లిపై పూర్ణ (చైతన్య) బాధను ‘వన్ బోయ్.. వన్ గాళ్’ పాటగా షేర్ చేశాడు. వన్ బోయ్ వన్ గాళ్ లుకింగ్/ హైటూ వెయంటూ చెకింగూ/ పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగు/ డౌరీ గివింగు/ ఇన్‌సైడ్ ఫస్ట్‌లవ్ కిల్లింగు/ యు ఆర్ డైయింగు -అంటూ ఈ పాట ఆంగ్ల పదాలతో ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అయితే, అరేంజ్‌డ్ మ్యారేజ్ గురించి పాటలో ఈ ఎక్స్‌ప్రెషన్ పలికించినా -క్లైమాక్స్ రిజల్యూషన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తీ పాట విన్నపుడు కలుగుతోంది. చైతూ వేదన, క్లైమాక్స్ రిజల్యూషన్ క్లారిటీగా తెలియాలంటే -ఏప్రిల్ 5 వరకూ ఆగక తప్పదుమరి.