డేటింగ్ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకమంది హీరో హీరోయిన్లు డేటింగ్ అంటే ముద్దని ప్రకటనలిస్తుంటే, త్రిష మాత్రం ఆ మాటని తన వద్ద ప్రస్తావించవద్దని కరాఖండీగా చెబుతోంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన త్రిష, ప్రస్తుతం స్లో అండ్ స్టడీగా కెరీర్‌ను సాగిస్తోంది. గత సంవత్సరం పెళ్లిపీటలవరకు వెళ్లిన ఆమె అక్కడే ఆగిపోయింది. పెళ్లి తప్పిపోవడంతో కెరీర్‌పై దృష్టిపెట్టి వరుసగా అవకాశాలు పొందుతోంది. ఈ నేపథ్యంలో డేటింగ్ గురించి ఆమె అభిప్రాయం అడిగితే పైవిధంగా స్పందించింది. అసలు అటువంటి మాట తాను వినడానికి కూడా ఇష్టపడనని, ఆ పదమే తనకు నచ్చదని అంటోంది. అమ్మాయి అబ్బాయి ఇష్టపడి సహజంగా పెళ్లితోనే కలిసి వుంటే బాగుంటుందని కానీ, వారికి వారే నిర్ణయాలు తీసుకుని కలిసి వుండడం అనేది తన మనోభీష్టానికి వ్యతిరేకమైనదని చెబుతోంది. దీన్నిబట్టి త్వరలోనే మళ్లీ పెళ్లి కబురు చెబుతుందేమో చూడాలి!