గ్యాంగ్ లీడర్ టైటిల్ మాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హిట్ చిత్రం గ్యాంగ్‌లీడర్ టైటిల్‌పై తాజాగా వివాదం చెలరేగింది. ఆర్నెల్ల క్రితమే చాంబర్‌లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించామని, ఈలోపు చట్టవిరుద్ధంగా టైటిల్‌ను కాజేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారంటూ మాణిక్యం మూవీస్ బ్యానర్ ఆరోపిస్తోంది. ఆ బ్యానర్‌పై నిర్మితమవుతున్న చిత్రానికి సంబంధించిన హీరో, నిర్మాత మోహన్ కృష్ణ అభియోగం చేశారు. అయితే, నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి తాజాగా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ను ప్రకటించటం తలిసిందే. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ ప్రత్యేక వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించటంతో వివాదం తలెత్తింది. వివాదంపై మోహన కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చాంబర్ పెద్దలముందుకు తెచ్చామని, ఆరునూరైనా గ్యాంగ్‌లీడర్ టైటిల్‌తో సినిమా నిర్మించి తీరతామని ప్రకటించారు. ‘మాణిక్యం మూవీస్ పతాకంపై గ్యాంగ్‌లీడర్ టైటిల్ రిజిస్టర్ చేయించాం. ఉగాదినుంచి గోదావరి జిల్లాల్లో 40 రోజులపాటు షూటింగు ప్లాన్ చేశాం. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న సినిమా విడుదల చేస్తాం. రైతు సమస్యను ఇతివృత్తంగా తీసుకుని సినిమా రూపొందిస్తున్నాం. అయితే, మెగా ఫ్యామిలీ అడిగితే సంతోషంగా టైటిల్ ఇస్తాం తప్ప, మరొకరికి ఇచ్చే సమస్యే లేదన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో హీరో మోహన్‌తో ఏడాదిగా సినిమాపై వర్క్ చేస్తున్నా. టైటిల్ పూర్తి హక్కులు మాణిక్యం మూవీస్‌వి అన్నారు. సమావేశంలో కెమెరామెన్ మురళి, నటుడు ఆర్య మాట్లాడారు.