అక్షయ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమేక్‌లో నటించడానికి బాలీవుడ్ నటి కైరా అద్వానీ ఓకె చెప్పిందట. లారెన్స్ ప్రస్తుతం కాంచన-3 చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడట. రాఘవ లారెన్స్ ఇంతకుముందు తెరకెక్కించిన కాంచన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. అక్షయ్‌కుమార్ ఇప్పటికే కోలీవుడ్‌లో 2.0 చిత్రంలో విలన్‌గా నటించి దుమ్మురేపాడు. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా నటించడానికి సమ్మతించే అక్షయ్‌కి కాంచన చిత్రం బాగా నచ్చిందట. దీంతో ఆ చిత్ర హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఆయనకు జంటగా కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.