అనసూయ కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కథనం. ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ పతాకాలపై బట్టేపాటి నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తుంటే, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెనె్నల కిషోర్, పెళ్లి పృథ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా టీజర్‌ని రామ్‌చరణ్ భార్య కొణిదెల ఉపాసన విడుదల చేశారు. చిత్ర విశేషాలను నిర్మాత నరేంద్రరెడ్డి వెల్లడిస్తూ కథనచ్చి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అనసూయది ఫుల్‌లెంగ్త్ రోల్. ఆమె కెరీర్‌లో ఇదొక బ్లాక్‌బస్టర్ కానుందన్న నమ్మకం ఉంది. టీజర్‌ను విడుదల చేసిన ఉపాసనకు కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ ఇది తన మొదటి చిత్రమన్నారు. క్షణం, రంగస్థలం తర్వాత అనసూయ చేస్తున్న కథనం సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ ఖాయమన్నారు. ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉందని, ఒక పాట వినా సినిమా షూటింగ్ పూరె్తైందన్నారు. నరేందర్‌రెడ్డి పంపిణీదారుగానే కాదు, నిర్మాతగానూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమా బాగా రావడానికి సహకరించిన టీం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.