సిద్ధార్థ్.. ఎక్స్‌క్యూజ్‌మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దార్థ్ మంచి నటుడే కాదు, గాయకుడు కూడా. అపుడో ఇపుడో ఎపుడో (బొమ్మరిల్లు), 176 బీచ్ హౌస్‌లో ప్రేమదేవత (ఓయ్), నిన్ను చూస్తుంటే (ఆట).. అలరించే పాటలతో ఆడియన్స్‌ని మెప్పించింది సిద్ధార్థే. చాలారోజుల తరువాత మళ్లీ ఈ హీరో ఓ పాటేసుకున్నాడు. తనకోసం కాదు, సందీప్ కిషన్ కోసం. సందీప్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం -నినువీడని నీడను నేనే. అన్యసింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పనె్నం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం కోసం రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్‌క్యూజ్‌మీ రాక్షసి’ పాటను సిద్ధార్థ్ పాడాడు. ఇటీవలే సాంగ్ రికార్డింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘మధుర భాష తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నటుడిగా నాకు గుర్తింపు, గౌరవం, స్టార్‌డమ్‌ని ఇచ్చింది తెలుగు సినిమాయే. ఈ పాట పాడటానికి మరో కారణం -సందీప్ అంటే ఇష్టం. వ్యక్తిగా, నటుడిగా తను నాకు తమ్ముడులాంటివాడు. తను నిర్మాతగా మారి నటిస్తున్న సినిమా కోసం పాట పాడమన్నపుడు కాదనలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్ అంటే నాకు చాలా ఇష్టం. తొలిరోజుల్లో హీరోగా నన్ను ప్రోత్సహించాడు. ఫస్ట్‌టైం ప్రొడక్షన్ చేస్తున్న చిత్రంలో తనను ఏదోలా అసోసియేట్ చేయాలన్న భావనతోనే రిక్వెస్ట్ చేశా. అతని గొంతులో నా పాట రావడం చాలా హ్యాపీగా ఉంది. నటుడిగా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లను నా ప్రొడక్షన్‌లో ఏదోకవిధంగా భాగస్వామి చేయడానికి ట్రై చేస్తున్నా’ అన్నాడు. సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్ హీరోగా నటించి నిర్మించిన తొలి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’కి, సందీప్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తొలి చిత్రానికి నేనే సంగీత దర్శకుడు కావడం యాధృచ్చికమే కాదు, సంతోషం కూడా. ఎందుకంటే ఇద్దరూ నాకు మంచి స్నేహితులు’ అన్నారు. పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్ వాయిస్‌ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణమైన పదాలతో మనసుపెట్టి రాసిన పాట. ఆయన గాత్రంలో అన్ని పాటలూ హిట్. ఈ పాటకూ మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా’ అన్నాడు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, వెనె్నల కిషోర్, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.