ఆ 31న ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి కొండలరావు, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీ గౌతమ్ క్రియేషన్స్ పతాకంపై జి కొండలరావు దర్శకత్వంలో జి లక్ష్మణరావు నిర్మిస్తున్న చిత్రం డిసెంబర్ 31. ఇటీవలే హైదరాబాద్‌లో ఆడియోను విడదల చేశారు. దర్శకుడు జి కొండలరావు మాట్లాడుతూ డిసెంబర్ 31 ఏంజరిగిందన్న కథాంశంతో రూపొందించిన చిత్రంలో తెలుగు ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్నాయన్నారు. సంగీత దర్శకుడు బోలే మంచి పాటలు ఇచ్చారన్నారు. ఏటా డిసెంబర్ 31న వైజాగ్‌లో ఎంతోమంది చనిపోతున్నారని, వీళ్లను ఎవరు చంపుతున్నారో చేధించేందుకు పోలీసులు మొదలుపెట్టిన మిషనే ఏసీపీ రవీందర్ అన్నారు. పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అందరికీ నచ్చుతుందని, మార్చి చివరిలో సినిమా విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
నిర్మాత జి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రాజెక్టు బాగా రావడానికి సహకరించిన పాట శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణంలో కాంప్రమైజ్ కాలేదని, సంస్థకు మంచి పేరొస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. సంగీత దర్శకుడు బోలే మాట్లాడుతూ పాటలు ఆడియన్స్‌కి కనెక్టవుతాయని, ఆర్‌ఆర్ చిత్రానికి ప్రాణంలాంటిదన్నారు. చిత్రానికి డిఆర్ వెంకటేష్ కెమెరా సహకారం అందించారు.