భాగమతి భక్తిరసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోలకి ధీటుగా బాక్సాఫీస్ వద్ద లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తాచాటిన స్వీటీ, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసింది. తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘సైలెన్స్’ ప్రాజెక్టు చేస్తోంది అనుష్క. గత ఏడాది కూడా తనదైన పెర్ఫార్మెన్స్‌తో భాగమతిగా మెప్పించి అనూహ్య విజయాన్ని అందుకున్న జేజమ్మ, సైలెన్స్ తర్వాత మరో ప్రాజెక్టునీ లైన్‌లో పెట్టిందట. ఓ భక్తిరస చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించనుందట. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో అయ్యప్పస్వామిపై సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టులో అనుష్క కీలక పాత్ర చేయనుందని వినిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి సినిమా మొదలవుతుందని అంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ చిత్రాన్ని విడుదల చేస్తారట.