వస్తోంది.. ఉద్యమసింహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉద్యమసారధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవిరెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుంటే అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ బుధవారం ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించారు. నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల చేసి మాట్లాడుతూ ‘ఉద్యమసింహం కేసీఆర్ జీవిత కథ కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కేసీఆర్ సాధించాడు. తరువాత దాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏమిటన్నదే సినిమా. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్నిరకాల కమర్షియల్ హంగులతో సినిమా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. ఈనెల 29న సినిమాను విడుదలచేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా సాగింది. ప్రత్యేక తెలంగాణకోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే పోరాడి తెలంగాణ సాధించాడు. ఆయన సంకల్పం బలమైనది. తెలంగాణకోసం కేసీఆర్ పోరాటం ఎలా జరిపారన్న అంశాలు సినిమాలో చూపిస్తున్నాం. నిర్మాత నాగేశ్వరరావు సపోర్ట్ మరవలేనిది. అలాగే టీం సపోర్ట్‌కు కృతజ్ఞతలు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి ఇచ్చిన పాటలు హైలెట్. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. నటి లత మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుగా అందరి అభిమానాన్ని అందుకున్న కవితక్క పాత్రలో నటించడం హ్యాపీగా ఉంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేయడం మరింత సంతోషం అన్నారు. మాటల రచయిత కృష్ణ రాపోలు మాట్లాడుతూ సినిమాకు మాటలు రాసే అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. కేసీఆర్ సినిమాకు మాటలు రాయడమన్నది మామూలు కాదు. కానీ దర్శకుడు నాతో చక్కటి మాటలు రాయించాడు. తప్పకుండా సినిమా సంభాషణలు మీ అందరికీ నచ్చుతాయన్నారు. కార్యక్రమంలో సూర్య, సాహిత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.