నవ్వులు రువ్వే వర్మ...శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. యువ జంటగా బాబ్త్రన్, బిందు బార్బి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఉగాది సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు భువన విజయ్ మాట్లాడుతూ, గోదావరి జిల్లాలలో ఆహ్లాదకరమైన ప్రాంతాలలో షూటింగ్ చేశామని, మూఢ నమ్మకాలపై రూపొందిన ఈ సినిమాలో సెటైర్ కామెడీ వుంటుందని అన్నారు. వర్మగా గిరిబాబు, శర్మగా జూ.రేలంగి హాస్యాన్ని పండించారని, హీరో తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రయత్నించిన విధానం అందరినీ నవ్విస్తూ చివరిలో థ్రిల్‌కు గురిచేస్తుందని, వంద శాతం కామెడీని ఈ చిత్రం ద్వారా ఆశించవచ్చని, త్వరలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుతామని ఆయన తెలిపారు. దీక్షితులు, రమణ, ఉదయబాబు, అజయ్, శ్రీరామ్, భారతి, లలిత, లక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రమణ రాథోడ్, కెమెరా:రంగ, ఎడిటింగ్:ప్రభు, పాటలు:రమణ, రచన, దర్శకత్వం:్భవన విజయ్.

చిత్రం బాబ్త్రన్, బిందు బార్బి