మొదలైన కేజీఎఫ్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ‘కెజిఎఫ్ -చాప్టర్ 1’ సంచలనాలు తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250కోట్లు వసూలుచేసి రికార్డులు సృష్టించింది. సౌత్‌లో బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకున్న సిరీస్ ఇది. కన్నడలో 100కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా 45కోట్లు పైగా వసూలు చేయడం ఓ సంచలనం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించింది. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. చాప్టర్-1 ఘన విజయం నేపథ్యంలో కెజిఎఫ్ సీక్వెల్‌పై భారీ అంచనాలేర్పడ్డాయి. చాప్టర్-2లో బాలీవుడ్ స్టార్స్ నటించనున్నారు. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని నేడు బెంగళూరు కంఠీరవ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఉదయం 9.30కు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు, ‘కెజిఎఫ్- 2’ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర నిర్మాత విజయ్‌కిరంగదూర్, దర్శకుడుప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్, కథానాయిక శ్రీనిధిశెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నెలాఖరునుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబర్ నుంచి సీజీ వర్క్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తారు. 2020 వేసవి కానుకగా సినిమా రిలీజవుతుంది. చాప్టర్1లో నటించిన స్టార్లంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ స్టార్లు ఇందులో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. సీక్వెల్ చిత్రాన్ని ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. కెజిఎఫ్ చాప్టర్ -1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అందరికీ చాప్టర్- 2 డబుల్ ట్రీట్ ఇస్తుందని యశ్ అన్నాడు.