సెన్సార్‌లో కెఎస్ 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్‌ఖాన్, శైలజ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కెఎస్ 100. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న సినిమా ఇప్పటికే ఫస్ట్‌లుక్ విడుదలై మంచి స్పందన దక్కించుకోవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయ. కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న కెఎస్ 100 ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. మార్చిలోనే సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాసలు చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ- చిత్రం ఔట్‌పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి మార్చిలోనే సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్ధా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన చిత్రానికి నవనీత్‌చారి సంగీతం సమకూరుస్తుండగా, భాషాశ్రీ సాహిత్యం అందించారు.