ఎమోషనల్ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సై, దూకుడు, శ్రీమంతులు, మగధీరలాంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న చుత్రం -ఎదురీత. దర్శకుడు బాలమురుగన్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. లియోనా లిషోయ్ హీరోయిన్‌గా చేస్తుంటే అరల్ కొరెల్లి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో హీరో కల్యాణ్‌రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ టీజర్‌ను విడుదల చేసిన కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఓ తండ్రి కుమారుడి మధ్య సాగిన ఎమోషనల్ డ్రామా ఇతివృత్తంగా సినిమా తెరకెక్కుతోందన్నారు. బాధ్యత కలిగిన తండ్రి అన్నదానికి సినిమా చేస్తున్నపుడే అర్థం తెలిసిందని, పిల్లలకు నాణ్యమైన సమయం కేటాయించడం బాధ్యతల్లో ముఖ్యాంశమన్నారు. ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రిమర్చిపోతే, ఆ తరువాత ఏంజరిగిందనే దాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించాడన్నారు. దర్శకుడి ప్రతిభ, నిర్మాత గట్స్ ఎదురీతలో చూస్తారన్నారు. నిర్మాత బోగారి మాట్లాడుతూ ‘సినిమా తీయడంలో కష్టమేమిటో అర్థమైంది. శ్రవణ్ సహకారంతోనే సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయనకు రుణపడి ఉంటాను’ అన్నారు. దర్శకుడు బాలమురుగన్ మాట్లాడుతూ ‘తొలి సినిమా అయినా నిర్మాత గట్స్‌తో తీస్తున్నారు. కథను, నన్ను నమ్మిన హీరో శ్రవణ్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. హీరోయిన్ లియోనా లిషోయ్ మాట్లాడుతూ ‘అందరం హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేశాం. తగిన ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం. అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు’ చెప్పారు. కార్యక్రమంలో జియా శర్మ, శాన్వీ మేఘన, కమెడియన్ భద్రం, ఫైట్‌మాస్టర్ రామకృష్ణ తదితరులు మాట్లాడారు.