సౌత్‌ను కమ్మేస్తున్నాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైత్రి మూవీస్ బ్యానర్‌లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం పెండింగ్ పనులు పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్స్ జోరుగా పూర్తి చేస్తున్నారు. ఆక్రమంలోనే మైత్రి సంస్థనుంచి దేవరకొండ నటించే తదుపరి చిత్రంపైనా అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రి మూవీ మేకర్స్ స్పీడ్, గట్స్ గురించి పరిశ్రమలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు అగ్ర హీరోలతో సినిమాలు, మరోవైపు నవతరం హీరోలు, కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ మైత్రి సంస్థ చూపిస్తున్న జోరు ప్రముఖంగా చర్చకొస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించే తొమ్మిదో సినిమాని ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఏప్రిల్ 22న దేశ రాజధాని ఢిల్లీలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని మైత్రి సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. కాక్కముట్టై చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆనంద్ అన్నమలై ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దేవరకొండకు వరుసగా మైత్రి మూవీ మేకర్స్‌లో రెండో సినిమా ఇది. తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లోనూ భారీగా రిలీజ్ చేయాలన్నది ఆలోచన. ఈ చిత్రంలో దేవరకొండ ఓ ప్రొఫెషనల్ బైకర్ పాత్రలో నటించడం ఇంకా ఎగ్జయిటింగ్ ఎలిమెంట్.