24న బ్రహ్మోత్సవం ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఉగాదికి సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, జనవరి 1న విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే రోజు విడుదలైన ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. ఈ నెల 24న ఆడియోను తిరుపతిలో వైభవంగా విడుదల చేయనున్నామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, షాయాజీ షిండే, కృష్ణ్భగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కెమెరా:ఆర్.రత్నవేలు, సంగీతం:మిక్కీ జె మేయర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల.