స్టార్స్ వార్ ఫిక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లూరి, కొమ్రుం జీవితాల్లోని మిస్టీరియస్ టైం ప్రస్తావనతో కొత్త కథ మొదలెట్టాడు జక్కన్న. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ఒకే ప్రశ్నతో కోట్ల మెదళ్లను మెలితిప్పిన దర్శకధీరుడు -ఇప్పుడు కొత్తగా.. ఆ టైంలో వాళ్లేంచేసుంటారు? అన్న ప్రశ్నను కథగా సంధిస్తున్నాడు. స్టార్‌హీరోలు యంగ్ ఎన్టీఆర్, మెగా రాంచరణ్‌లతో ఎస్‌ఎస్ రాజవౌళి తెరకెక్కిస్తున్న చిత్రం -ట్రిపుల్ ఆర్. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్, హైటెక్నికల్ వాల్యూస్ ఫిక్షన్. చిత్రీకరణలో వున్న సినిమాకు సంబంధించి ఏ ఒక్క విషయమూ బయటకు పొక్కకుండా ఇప్పటివరకూ జాగ్రత్తపడిన రాజవౌళి టీం, ఎట్టకేలకు గురువారం సస్పెన్స్‌కు తెరదించింది. హీరోలు యంగ్ ఎన్టీఆర్, రామచరణ్‌లతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాజవౌళి అనేక విషయాలను వెల్లడించాడు. మీడియా ముచ్చట్ల వేదికగానే -సినిమా ప్రమోషన్స్‌కు తెరలేపాడు. నిర్మాత దానయ్య సహా నాలుగు పిల్లర్లు వెల్లడించిన ఆసక్తికర అంశాలపై నేటినుంచి ఫ్రీ ప్రమోషనల్ దుమారం లేవడం ఖాయం. ఆ విషయలేంటో వాళ్ల మాటల్లోనే చూద్దాం.

పాత్రలు నిజం కథే.. కల్పితం

థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ -సినిమాలో ఏం చూపిస్తున్నారు. కంటెంట్ ఏమిటి? ఎలాంటి అనుభూతి ఇవ్వబోతుందన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. అందుకే -నేనెప్పుడూ ఆడియెన్స్‌ని ప్రిపేర్ చేస్తాను. ఎలాంటి అనుభూతి ఇవ్వనున్నానో ముందే చెప్పేస్తాను. ఈసారి మాత్రం కొన్ని కారణాల వల్ల చెప్పలేదు. కారణం -బిగినింగ్ స్టేజ్‌లోనే ఉన్నా. ప్లాట్ పాయింట్ మాత్రం -ఇద్దరు ఉద్యమకారుల కథ ఇది. 1897లో ఆంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇంగ్లీష్ చదువులే కాదు, మన పురాణాలు, ఇతిహాసాలూ బాగా చదువుకున్నారు. యోగ నిపుణుడు. అయితే యుక్త వయసులోనే ఇల్లొదిలి వెళ్లాడంటారు. ఎక్కడికెళ్లాడో, ఏంచేశాడో ఎవ్వరికీ తెలీదు. తిరిగొచ్చిన తర్వాత గిరిజనుల స్వేచ్ఛ కోసం సమరశంఖాన్ని పూరించాడు. అక్కడినుండి రామరాజు చారిత్రక పోరాట విషయాలన్నీ తెలిసినవే. చరిత్రలో చదువుకున్నవే.
అల్లూరి పుట్టిన రెండు మూడేళ్ల గ్యాప్‌లో అంటే 1901లో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాలో కొమ్రుం భీమ్ పుట్టాడు. ఆయనా యుక్త వయసులో ఇల్లొదిలి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. వెళ్లేముందు ఆయన నిరక్షరాస్యుడు. తిరిగి వచ్చేసరికి విద్యావంతుడు. ఆయనా నిజాం నిరంకుశత్వం, గిరిజనుల స్వాతంత్య్రం కోసం పోరాడాడు. అల్లూరి తరహాలోనే గెరిల్లా వార్, పోలీస్ స్టేషన్లపై దాడులు, తుపాకులు ఎత్తుకెళ్లడం, ప్రజలను ఉత్తేజపర్చడంలాంటి ఘట్టాలూ ఉన్నాయి. ఈ ఉద్యమకారుల గురించి చదువుతున్నపుడు -యాధృచ్చికంగా ఇద్దరూ ఒకే టైమ్‌లో పుట్టడం, ఒకే టైంలో వెళ్లిపోవడం, వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం, వచ్చిన తర్వాత ఒకేలా సమరం సాగించటం ఆసక్తిగా అనిపించింది. ఈ అంశాలనే ఇతివృత్తంగా చూపిస్తున్నా. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు యోధులు, చరిత్రలో ఎప్పుడూ కలవనివారు, ఒకరికొకరు సంబంధం లేనివాళ్లు -నిజంగా మనకు తెలియని టైంలో వాళ్లు కలుసుకునుంటే, ఒకరికొకరు ఇన్‌స్పిరేషన్ అయ్యుంటే, తర్వాత వాళ్లు బ్రిటీష్ ప్రభుత్వంపై, నిజాం ప్రభుత్వంపై పోరాడితే, ఆ పోరాటం వాళ్లమధ్య ఏర్పడిన స్నేహంద్వారా ఏర్పడివుంటే.. ఎలా ఉంటుందనేది నా కథలోని కల్పన. ఇది తెలిసిన కథ కాదు. పూర్తిగా ఫింక్షన్. కాకపోతే, ఇద్దరు యదార్థ యోధుల కథ ఆధారంగా చెప్పడమే. అందుకే భారీ సినిమాగా రూపొందిస్తున్నా. పెద్ద ప్లాట్‌ఫాంపై సినిమా చేస్తున్నా. దీనికోసం కొంతవరకు అధ్యయనం జరిగింది. 19వ దశాబ్ధపునాటి కథ కావడంతో రీసెర్చ్ తప్పలేదు. అందుకే సినిమా మొదలుపెట్టడానికే సమయం పట్టింది. ఇంత పెద్ద హీరోలున్న సినిమాకు సపోర్టింగ్ క్యారెక్టర్లూ బలంగా ఉండాలి. అజయ్ దేవగణ్ స్ట్రాంగ్ రోల్ చేయడానికి అంగీకరించాడు. ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ పవర్‌ఫుల్ పాత్రలో అజయ్ దేవగణ్ కనిపిస్తారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, చరణ్‌కు జోడీగా కనిపిస్తుంది. డైజీ ఎడ్గర్ జోన్స్ అనే బ్యూటీఫుల్ యంగ్ లేడీ తారక్‌కు పెయిర్‌గా కనిపిస్తుంది. సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపిస్తారు. సినిమాకు ఆయన పాత్ర బ్యాక్‌బోన్. ముందు ఆర్‌ఆర్‌ఆర్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్‌నుండి టైటిల్ బావుందన్న రెస్పాన్స్ వచ్చింది. దీంతో అన్ని భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్ కామన్ టైటిల్‌గా ఉంచి, వివరణాత్మక టైటిల్ మాత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలకు తగినవిధంగా ఒక్కొక్క స్టయిల్లో పెడతాను’.