జక్కన్నకే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ప్రెస్ కానె్ఫరెన్స్‌కి వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్‌గా వస్తా. కానీ ఎందుకో ఈసారి కాస్త నెర్వస్‌గా ఉంది. ఓవర్ వెల్మింగ్‌గా అనిపిస్తుంది. ఇది జక్కన్నతో నాలుగో ప్రాజెక్టు. నాకెరీర్‌లో అన్నింటికంటే ఇదొక స్పెషల్ మూవీగా మిగులుతుంది. ఎందుకంటే జక్కన్నతో పనిచేయడం, దాంతోపాటు చరణ్‌తో స్క్రీన్ షేర్. మా ఇద్దరి బాండింగ్ ఈ చిత్రంతో మొదలయ్యేది కాదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్టసుఖాలు పంచుకునే స్నేహమున్న మిత్రుడు. ఈ సినిమాలో పని చేయడానికికంటే ముందే ఈ బాండింగ్ ఎప్పుడైతే ఏర్పడిందో అది చిత్రంలోకి వచ్చేసరికి, కలిసి పని చేయాల్సి వచ్చేసరికి బాండింగ్ వేరే లెవల్‌కి వెళ్లింది. ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. ఆర్‌ఆర్‌ఆర్ -ఏ ఫిల్మ్ డిమాండ్స్ ఎలాట్ ఫ్రమ్ యాక్టర్స్. మనకు తెలియని గీత ఉంది. అల్లూరి సీతారామరాజు గురించి కానివ్వండి, కొమురం భీమ్ గురించి కానివ్వండి. ఇద్దరి గొప్ప వ్యక్తులు గురించి మనకు తెలియని గీత ఒకటి ఉంది. ఇప్పుడు ఇద్దరూ కనుక కలిసుంటే.. ఏం జరిగుండేది? అనే తాత్పర్యాన్ని దర్శకుడు కథలోకి తీసుకొచ్చాడో నటులుగా అది మాకు కొత్తయ్యింది. కంప్లీట్ బ్లాంక్‌గా ఉన్నా. ఎందుకంటే ఓ నటుడికి ఇన్‌ఫర్మేషన్ ఎంత తక్కువగావుంటే, అంత పెర్ఫార్మెన్స్ బయటికొస్తందని నమ్ముతా. నాకు, చరణ్‌కి నటులుగా ఎదగడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఈ చిత్రానిక షూటింగ్ ప్రారంభించడానికి ముందు మేంచేసిన వర్క్‌షాప్స్ ఫెంటాస్టిక్. ఇప్పటిదాకా చేసిన 28 సినిమాల్లో నేను చేసిన దానికంటే ఈ సినిమాలో నేను తీసుకున్న శిక్షణ, మా ఫ్యూచర్ ఫిలింస్‌కు హెల్పవుతుంది.
ఇలాంటి గొప్ప పాత్రలను చేయడం గొప్ప విషయం. రాజవౌళి బ్రెయిన్‌నుండి వచ్చిన ఈ థాట్ 101 శాతం గొప్ప చిత్రంగా నిలుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నా. నటులుగా ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు జక్కన్నకి కృతజ్ఞతలు. ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఎలాంటి బేషజాలు లేకుండా స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడానికి అంగీకరించినందుకు చరణ్‌కు థాంక్స్. మా జనరేషన్‌లో మేం దీన్ని సాధ్యమయ్యేలా చేశాం. ఇది సాధ్యమవడానికి కారణం జక్కన్నపై మాకున్న నమ్మకమే. మా ఫ్రెండ్‌షిప్‌పై మాకున్న నమ్మకం. మా నమ్మకం ఈ చిత్రానికి ఓ పాజిటివిటీగా మారి ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నా.