బౌండరీస్ లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు మణిరత్నం సినిమాలు ఆడకున్నా, ఆయన సినిమాల్లో నటించిన నాయికలకు పేరొస్తుంటుంది. అందాల తార ఆదితి రావు హదరికీ అలాంటి అదృష్టమే పట్టింది. కాట్రు వెలియిదై చిత్రంతో తమిళ ప్రేక్షకులను మైమరిపించేలా చేసింది ఆదితి. ఈ చిత్రం తెలుగులో చెలియా పేరిట విడుదలైంది. కాట్రు వెలియిదై ప్రభావంతో ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో సైకో చిత్రంలో నటిస్తున్న ఆదితీ రావ్.. ధనుష్ సరసన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలోనూ కనిపించనుందట. అంతరిక్షం తరువాత తెలుగులో ఆమెకు సినిమాలు తగ్గాయి. అదే విషయాన్ని ప్రశ్నిస్తే -సినిమాల ఎంపికలో కథే ముఖ్యంగానీ తనకు భాషాభేదాలు లేవంటోంది ఆదితి. అన్నట్టుగానే అవకాశం వచ్చిన భాషలో సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ -సంతోషాలు, బాధలకు మనుషులంతా ఒకేలా స్పందిస్తారు. నేను ఎంచుకునే చిత్రాలకు హద్దులు చూడను. భాష, ప్రాంతంలాంటి తేడాలు నన్ను నటించకుండా అడ్డుకోవడం ఇష్టముండదు. సినిమా కథలు మనిషి భావోద్వేగాలను చూపిస్తాయి’ అని చెప్తోంది. తెలివైన అందగత్తె ఆదితి.