మోహన్‌రాజాతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫామ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. విజయ్ చేసిన ప్రయోగాలకు అభిమానులూ అండవుతున్నారు. ఇటీవల వచ్చిన సర్కార్ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది. రజనీకాంత్ తర్వాత స్థానం విజయ్‌దేనని అభిమానులు అంటారు. కానీ ఈ మధ్య మరో హీరో అజిత్ నటించిన సినిమాలు సైతం భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. దాంతో విజయ్, అజిత్ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తర్వాత మోహన్‌రాజా దర్శకత్వంలో నటించే సినిమా మొదలవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మోహన్‌రాజా, విజయ్ కలిసి గతంలో వేలాయుధం సినిమా చేశారు. ఆమధ్య మోహన్‌రాజా దర్శకత్వం వహించిన తనీ ఒరువన్ సినిమా భారీ విజయం సాధించడం తెలిసిందే. తరువాత మోహన్ ఇతర హీరోల సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇంతకాలానికి విజయ్‌తో సినిమా చేసేందుకు కుదిరిందని అంటున్నారు. మోహన్‌రాజా మరెవరో కాదు, తెలుగులో హనుమాన్‌జంక్షన్, క్షేమంగావెళ్లి లాభంగా రండి, హిట్లర్ సినిమాలు నిర్మించిన ఎడిటర్ మోహన్ తనయుడు.