చేజారిన రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ విజయగాథను ‘సైనా’గా దర్శకుడు అమోల్‌సేన్ గుప్తా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కొంతభాగం పూరె్తైంది. అయితే, షూటింగ్ టైంలో లీడ్‌రోల్ పోషిస్తున్న శ్రద్ధాకఫూర్‌కు డెంగ్యూ సోకడంతో ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. సైనా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న నిర్మాత, టి.సిరీస్ అధినేత భూషణకుమార్ స్వయంగా ఈ ప్రకటన చేయటం గమనార్హం. శ్రద్ధను తప్పించడానికి కారణం అనారోగ్యమేనా? ఇంకేదైనా వివాదం చెలరేగిందా? అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే, శ్రద్ధ స్థానంలో ‘సైనా’ పాత్ర కోసం పరిణీతి చోప్రాను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. ‘సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించబోతున్న పరిణీతికి స్వాగతం’ అంటూ ఓ ఫోటోనూ పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం ఇంతకుముందే శ్రద్ధ.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెలపాటు శిక్షణ తీసుకుని మెళకువలు అభ్యసించింది. ఇప్పుడు పరిణీతను తీసకోవడంతో -గోపీచంద్ వద్దకు ఆమె శిక్షణకు వస్తుందేమో చూడాలి. ఇదిలావుంటే, చిత్రాన్ని 2020నాటికి పూర్తిచేసి థియేటర్లకు తేచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు భూషణకుమార్ పేర్కొన్నాడు.