బిగ్ సింగర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అమితాబ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడాయన సింగర్‌గానూ మారాడు. ఇదివరకు బాలీవుడ్ సినిమాల కోసం గొంతువిప్పిన బిగ్ బి, ఈసారి కన్నడ పాట కోసం గొంతు సరిచేసుకున్నాడు. కన్నడలో రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బటర్ ఫ్లై. ఈ చిత్రంలో అమితాబ్ ఓ క్లబ్ సాంగ్ పాడేందుకు సిద్ధమవుతున్నాడట. ఇది కంగనా రనౌత్ చిత్రం క్వీన్‌కు రీమేక్. అక్కడ పరుల్ యాదవ్ టైటిల్ రోల్ పోషిస్తుంటే, తెలుగులో తమన్నా చేస్తోంది. దటీజ్ మహాలక్ష్మి పేరిట విడుదలకు రెడీగా ఉంది. తమిళ్‌లో కాజల్ అగర్వాల్‌తో పారిస్ పారిస్‌గా, మలయాళంలో మంజిమా మోహన్‌తో జామ్‌జామ్‌గా ఒకేసారి తెరకెక్కించారు. అయితే దర్శకులు వేర్వేరు. ఈ కారణంగానే అమితాబ్ గొంతు మనకు కన్నడ వర్షన్‌లో మాత్రమే వినిపించనుంది.