29న లక్ష్మీస్ ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. నందమూరి తారక రామారావు జీవితంలో అత్యంత ముఖ్యఘట్టమంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టడం తెలిసిందే. వాస్తవానికి మార్చి 22న సినిమాను విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద చిత్రాన్ని విడుదల చేయడం హేతుబద్ధం కాదంటూ తెదేపా శ్రేణులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో సినిమా విడుదలను ఆపాలంటూ చిత్ర బృందాన్ని సెన్సార్ బోర్డు ఆదేశించింది. సెన్సార్ బోర్డుతో చర్చలు జరిపిన వర్మ, చివరకు విడుదల తేదీని 29కి వాయిదా వేసుకున్నారు. కడపలో నిర్వహించనున్న బహిరంగ సభలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. ఇదిలావుంటే, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసినట్టు తెలిసింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో కోర్టులు కలుగుచేసుకునేది లేదంటూ స్పష్టం చేసింది. రెండు సినిమాల్లో అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేయడంతో తెలంగాణలో సినిమా విడుదలకు ఇబ్బందులు తొలగిపోయాయని తెలుస్తోంది.