కెరీర్.. హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్ అరుణ్, తరువాత భిన్నమైన సినిమాలుచేసి యంగ్ హీరోగా క్రేజ్ సాధించాడు. తాజాగా అడల్ట్ కామెడీ కంటెంట్‌తో తెరకెక్కిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఆదిత్‌తో ముచ్చట్లు.
* ఒక అబ్బాయి పెళ్లికోసం అమ్మాయిని వెతుకుతూ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడన్నదే కథ. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. నిజానికి టైటిల్ సినిమాకు సరిగ్గా సరిపోయేదే. హారర్ కామెడీ కాబట్టి అలా పెట్టాం. సినిమాలో డబుల్ మీనింగ్స్ ఉండొచ్చు, అశ్లీలత ఉండదు. ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టంలేక స్ట్రెయిట్ టైటిల్ పెట్టాం. తమిళంలో ఇదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా సంచలన విజయం అందుకుంది.
* ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కొత్త పాయింట్. నేను ఇదివరకు చాలా సినిమాలు చేశాను. అవన్నీ భిన్నమైన సినిమాలు. అయితే నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన సినిమా ఇదే.
ఈ సినిమాకు కేవలం 10రోజులు మాత్రమే తీసుకున్నా. ఇదో గొప్ప సినిమా అనను కానీ యూత్ సరదాగా నవ్వుకునేదే. డబ్బుకోసం చేయలేదు. కథ నచ్చింది. చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేశా.
* సరైన బ్రేక్‌రాలేదని అంటున్నారు. కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని ఆడవు. నేను సక్సెస్‌ల గురించి ఆలోచించను. మంచి సినిమా చేశామా? లేదా? చేసింది కరెక్ట్‌గా చేశామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తా. ఇండస్ట్రీలో నా ఏజ్ వున్నవారు కొందరు ఇప్పటికీ సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను. కానీ నేనింకా హీరోగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక్కరే మెగాస్టార్. ఒక్కరే సూపర్ స్టార్ ఉంటారు. అందరు స్టార్స్ అవ్వలేరు.
* ఇక తదుపరి చిత్రాలు గురించి చెప్పాలంటే ప్రస్తుతం డ్యూడ్ అనే చిత్రం చేస్తున్నా. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో ఉంటుంది.
సినిమాలో నాతోపాటు ప్రిన్స్, ప్రియదర్శి కూడా నటిస్తున్నారు. దాంతోపాటు మరో రెండు చిత్రాలకు సైన్ చేశాను. అలాగే తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయి.