కీర్తి.. మళ్లీ అలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి బయోపిక్‌తో కీర్తి సురేష్ ‘మహానటి’ అనిపించుకుంది. తర్వాత సీనియర్ హీరోలతోపాటు స్టార్లతో వరస అవకాశాలు చేజిక్కించుకున్న కీర్తి, ఆ స్థాయి ఫీడ్‌బ్యాక్ మళ్లీ సంపాదించలేదు. అయితే అలాంటి పెర్ఫార్మెన్స్ చేయగల పాత్ర మరోసారి చేసే అవకాశం కీర్తికి దక్కింది. అజయ్ దేవ్‌గన్ హీరోగా నిన్నటితరం ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గత ఏడాది సర్‌ఫ్రైజ్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన బదాయిహూ దర్శకుడు అమిత్ శర్మ దీనికి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. బోనీకపూర్ నిర్మాతగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కొలిక్కి వచ్చిందని సమాచారం. అయితే కీర్తిసురేష్ పాత్రకు సంబంధించి ఇందులో ఓ విశేషం ఉందట. రెండు వయసు పాత్రల్లోనూ కీర్తి కనిపించనుందట. ఒకటి ఇబ్రహీం వయసులో వున్నపుడు తనను ప్రేమించే అమ్మాయిగా, తర్వాత నలభయ్యోపడిలో పడిన మహిళగానూ ఆమె పాత్రలను డిజైన్ చేశారట. పెర్ఫార్మెన్స్‌పరంగా మహానటి స్థాయిలో ఇందులో నటించాల్సి ఉంటుందని అమిత్‌శర్మ ముందే చెప్పాడట. ఛాలెంజింగ్‌గా ఉండటంతోపాటు ఇలాంటి డెబ్యూ అయితేనే బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తాయని గుర్తించిన కీర్తిసురేష్ ఆలస్యం చేయకుండా ఒప్పేసుకుందని అంటున్నారు. మొత్తానికి కొంత లేటైనా, టాలెంట్‌కి పదునుపెట్టే పాత్రలో బాలీవుడ్ స్క్రీన్‌మీద కనిపించబోతోంది కీర్తి.