ఆకాశవాణి.. విశాఖపట్టణ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ, ఉమయ హీరో హీరోయిన్లుగా సైన్స్ స్టూడియోస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మర్రి మేకల మల్లిఖార్జున్ నిర్మాత. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘సతీష్ బత్తుల తొలిసారి దర్శకుడిగా ప్రయోగం చేస్తున్నాడు. ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం కథ ముందు నాకు వినిపించాడు. బావుందని అప్రీషియేట్ చేశా. ఇప్పుడు సినిమాను సిద్ధంచేసి టైటిల్ పోస్టర్ విడుదల చేయమన్నాడు. మంచి కథ, తప్పకుండా మెప్పిస్తుందని భావిస్తున్నా. నిర్మాత మల్లిఖార్జున్‌కు నిర్మాతగా ఇది తొలి చిత్రం. ఈ సినిమా మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. చిత్ర నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ ‘సతీష్ కథ చెప్పగానే నచ్చింది. అయితే, నెరేషన్‌కు మించి కథను తెరకెక్కించటం ఇంకా బావుంది. నిర్మాతగా నావంతు బాధ్యత సమర్ధతతో నిర్వర్తించా. శివ, ఉమయ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ ‘జబర్దస్త్ ప్రోగ్రాంతో నేను పరిచయస్తుడినే. అయితే, డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ వచ్చాను. ఈ సినిమాతో నా కల నెరవేరుతుంది. ఆడియన్స్ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నా. ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మల్లిఖార్జున్ సపోర్ట్ మర్చిపోలేను. కార్తీక్ మ్యూజిక్, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. టైటిల్ పోస్టర్ విడుదల ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన రాజ్ కందుకూరికి కృతజ్ఞతలు అన్నారు.