డివోషనల్ థ్రిల్లర్ దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో దిలీప్‌కుమార్ సల్వాది స్వీయదర్శకత్వంలో వస్తున్న చిత్రం దిక్సూచి. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని బేబి సనికసాయి శ్రీరాచూరి సమర్పిస్తుంటే, శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మూడోవారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ‘దిక్సూచి మ్యూజిక్ యాప్ ద్వారా ఆడియోను విడుదల చేశారు. హీరో దిలీప్‌కుమార్ సల్వాది మాట్లాడుతూ థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో 1970 బ్యాక్‌డ్రాప్ సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. దిక్సూచి మ్యూజిక్ యాప్ ద్వారా ఆడియో విడుదల చేశామని, ఇదే యాప్ నుంచి భవిష్యత్‌లో మరిన్ని సినిమా పాటలు విడుదల చేయనున్నామన్నారు. త్వరలో రైన్‌బో కార్పెట్ షో పేరిట ప్రీరిలీజ్ ఈవెంట్ పంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, సినిమా చూసిన కామన్ ఆడియనే్స టీవీ ఇంటర్వ్యూలో సినిమా సమీక్ష చేస్తారన్నారు. నిర్మాత నరసింహరాజు మాట్లాడుతూ ‘కంటెంట్‌వున్న చిత్రమని, అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. మంచి సినిమాతో ప్రేక్షకుల మధ్యకు రావలన్న ఆలోచనతోనే దిక్సూచితో వస్తున్నాం’ అన్నారు. నటుడు అరుణ్ మాట్లాడుతూ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ, సామాన్యుడిగా సినిమా చేసిన దిలీప్ విడుదల తరువాత అసామాన్యుడిగా నిలుస్తాడరన్నారు.