గాయనిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలం పైగా టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ భామ త్రిషకు ఈమధ్య కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీతో పలు క్రేజీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టింది. త్రిష తాజాగా నటిస్తున్న ‘నాయకి’ చిత్రం కోసం ఓ పాట పాడిందన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొల్పుతుంది. ఇప్పటికే టీజర్ నాలుగు లక్షల వ్యూస్‌తో హంగామా చేస్తున్న ఈ సినిమాలో త్రిష పాట వినడానికి ఆమె అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారట. వారికోసం ఈ పాటను ఈనెల 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందట. తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలకు కానున్న ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో గాయనిగా కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటాననే నమ్మకంతో వుంది త్రిష.