కలిసొస్తుందని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేదో బెట్టుకట్టి ఓడిపోయన బాపతు కాదు, లక్కుపట్టి గెలిచేందుకు చేస్తున్న ప్రయత్నం. వరుసగా ఆరు పరాజయాలు వెంటాడడంతో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ న్యూమరాలజీని వెతుక్కోక తప్పలేదు. న్యూమరాలజీ ప్రకారమే లక్కందుకోడానికి పేరు మార్చుకున్నాడట. తాజాగా చేస్తున్న సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో సాయిధరమ్ ఉన్నాడు. తాజా చిత్రం ‘చిత్రలహరి’ కోసం లుక్ దగ్గరనుంచి సినిమా కథాంశం వరకు అన్నీ మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే పేరును సైతం మార్చేశాడు. ఇప్పటివరకు అన్ని సినిమాల్లో స్క్రీన్ నేమ్ సాయిధరమ్‌తేజ్ అని పడేది. చిత్రలహరిలో మాత్రం కేవలం సాయితేజ్ అని పడుతోంది. లక్ కోసమే సాయ తన పేరును ట్రిమ్ చేశారనే టాక్ వినపడుతోంది. ఈ కొత్త పేరు సాయితేజ్‌కు ఎలా కలిసొస్తుందో వేచి చూడాలి.