రెండో దేవిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రం హర్రర్ కామెడీగా మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా నాగార్జున, సమంత ప్రధాన పాత్రలతో రూపొందిన ‘రాజుగారి గది 2’ ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా దీనికి సీక్వెల్‌గా ‘రాజుగారి గది 3’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ఓంకార్ ప్లాన్ చేస్తున్నాడు. మెయిన్ లీడ్‌కోసం తమన్నాని ఎంపిక చేయాలనే ఆలోచనతో ప్రస్తుతం ఆమెతో కథాచర్చలు సాగిస్తున్నారట. తమన్నా ఇటీవల ‘ఎఫ్2’తో భారీ విజయాన్ని అందుకుని మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని మహిళా ప్రధానంగా రూపొందించబోతున్నారట. ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’. ‘సైరా నరసింహారెడ్డి’, ‘దేవి 2’చిత్రాల్లో నటిస్తూ తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అలాగే అభినేత్రి సినిమాలో ‘దేవి’గా భయపెట్టిన తమన్నా ఇప్పుడు ‘దేవి 2’తో కూడా మరోసారి ప్రేక్షకుల్ని వణికించేందుకు రెడీ అవుతోంది. దాంతోపాటు మరో హర్రర్ సినిమాకు ఓకే చెప్పిందట. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు తమన్నా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది.