మెగా @ 152

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తి కావాల్సిన షూటింగ్ కొన్ని కారణాలవల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌లు తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. సైరా ఆలస్యమవుతూ వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవితో కొరటాల ఫొటోషూట్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి రైతుపాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి ఏ సినిమాలోనూ కనిపించని విధంగా ఈ చిత్రంలో చూపించాలని కొరటాల ఆశపడుతున్నాడు. అందుకోసం చాలా బరువు తగ్గడంతోపాటు విభిన్నమైన మేకోవర్‌లో చిరంజీవిని చూపించాలని కొరటాల భావిస్తున్నాడు. సైరా ఎప్పుడు పూర్తయితే అపుడు తన సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను దర్శకుడు పరిశీలిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలన్న ప్రణాళిక ఉంది.