రొమాంటిక్‌గా.. కెఎస్ 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సమీర్‌ఖాన్, శైలజ జంటగా నటిస్తున్న చిత్రం కెఎస్ 100. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న సినిమాకు నవనీత్‌చారి సంగీతం అందించారు. సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కథ వినగానే నచ్చింది. దర్శకుడు షేర్‌ను ప్రోత్సహించాను. తను మంచి బడ్జెట్‌లో సినిమాను రూపొందించాడు అన్నారు. హీరో సమీర్‌ఖాన్ మాట్లాడుతూ టైటిల్‌కు అర్థమేంటని చాలామంది అడుగుతున్నారు. సోషల్ మీడియాలో టైటిల్‌పై వస్తున్న వార్తల్లో నిజంలేదు. కుటుంబమంతా కలిసి చూసే సినిమా. హారర్ కంటెంట్ కూడా వుందన్నారు. సంగీత దర్శకుడు నవనీతచారి మాట్లాడుతూ పాటలన్నీ బాగా వచ్చాయి. రాంమోహన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరును చక్కగా అందించారు అన్నారు. దర్శకుడు షేర్ మాట్లాడుతూ సిరాజ్ అనే నా పేరును ఈ సినిమా కోసం షేర్‌గా మార్చుకున్నా. ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమాను అమ్మాయిల కోసం తీశాను. అమ్మాయిలు దారుణమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. వారి ప్రతి అడుగులో ధైర్యం, ఇన్‌స్పిరేషన్ ఇద్దామన్నదే మా ఉద్దేశం. ఆర్టిస్టులందరికీ మంచిపేరు తెస్తుంది అన్నారు.