పోలీసోడు వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, సమంత, అమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో అట్లికుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం తేరీ. ఈ చిత్రాన్ని పోలీసోడు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, వచ్చేవారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అట్లి మాట్లాడుతూ, తన మొదటి సినిమా ‘రాజారాణి’ తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యిందని, ఆ తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయని, కానీ ఒక భారీ సినిమా చేసిన తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలనుకున్నానని అన్నారు. త్వరలో ఓ సినిమా ఉంటుందని, పోలీసోడు ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించామని, మిత్ర పాత్రలో సమంత చక్కటి ఎమోషన్స్‌ను పండించిందన్నారు. తప్పకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, నెల రోజుల క్రితం చెన్నయ్ వెళ్లినప్పుడు ఈ సినిమా ప్రోమోస్ పాటలు చూశానని, అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ సినిమా తెలుగులో చేయాలని. ‘రాజారాణి’ చిత్రం కూడా తెలుగులో నేనే రిలీజ్ చేశానని, అట్లి అద్భుతంగా తెరకెక్కించాడని, విజయ్, సమంతల జంట హైలెట్‌గా ఉంటుందని, పాటలు కూడా బావున్నాయని అంటున్నారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇది అన్నారు. సమంత మాట్లాడుతూ, ఇప్పటికి 20 సినిమాలు చేశానని, కొన్ని సినిమాలు విడుదల సమయంలో చాలా టెన్షన్ పడేదాన్నని, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. నా కెరీర్‌లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌సి.విలియమ్స్, ఎడిటర్: ఆంటోనీ రూబెన్, సంగీతం: జి.వి.ప్రకాష్, సహ నిర్మాతలు: శిరిష్, లక్ష్మణ్, నిర్మాత: రాజు, కలైపులి ఎస్.్థను, దర్శకత్వం: అట్లి.