మేకప్ లేకుండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల నాయకి రకుల్‌ప్రీత్‌సింగ్ అంటేనే గ్లామర్ క్వీన్. అటువంటి అందగత్తె ఎటువంటి మేకప్ లేకుండా సాదా సీదా అమ్మాయిగా కనిపిస్తే ఎలా వుంటుంది? ఇదిగో ఇలా వుంటుంది అనంటున్నారు ‘సరైనోడు’ దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఆమెతోపాటుగా కాథరిన్ ట్రెస్సా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ మెయిన్ హీరోయిన్ అయినా డీగ్లామర్ రోల్‌లో కనిపించనున్నదట. అసలు ఏ మాత్రం మేకప్ లేకుండానే ఓ ప్రయోగంలా, పక్కింటి అమ్మాయిలా కనిపించే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. దీనికి తగ్గట్టు ఆ చిత్రంలో తనను ఎవరూ గుర్తుపట్టలేరని కూడా ఈ గ్లామర్ బొమ్మ చెబుతోంది. పాటల్లో మాత్రం అందాల ఆరబోతతో ఖచ్చితంగా గుర్తిస్తారట. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో రకుల్ పాటల్లో గ్లామర్‌గా, మాటల్లో డీగ్లామర్‌గా ఎలా కనిపించనుందో చూడాల్సిందే!