చిన్న పిల్లలతో అంతా విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లికిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తూ రామ్‌కుమార్ దర్శకత్వంలో జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటాచారి ఎర్రోజు నిర్మిస్తున్న చిత్రం ‘అంతా విచిత్రం’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌కందుకూరి క్లాప్‌నివ్వగా రవి జి. కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ అందరూ చిన్న పిల్లలతో రూపొందిస్తున్న చిత్రమిది. నలుగురు హీరోలు, నలుగురో హీరోయిన్స్ ఉంటారు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్ల పాత్రల్లో చిన్న పిల్లలు కనిపిస్తారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాంబేబోలే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు రాని వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది అన్నారు. నిర్మాత వెంకటాచారి మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో రూపొందుతున్న రెండవ చిత్రమిది. ఇప్పటివరకూ ఎవరూ చేయలేని ప్రయత్నాన్ని మేం చేస్తున్నాం. ఈనెల 13నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జూలై మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు. రాజ్‌కందుకూరి మాట్లాడుతూ.. డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో 14 నుంచి 16 వయస్సున్న పిల్లల్ని తీసుకొని చేస్తున్నారు. నిజంగా ఇది ప్రయోగమని చెప్పాలి. ఈ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బాంబేబోలే, కెమెరా: మురళీ వై.కృష్ణ, కథ, మాటలు: ఎస్.రామారామ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహమ్మద్ అస్లామ్, నిర్మాత: వెంకటాచారి, దర్శకత్వం: రామ్‌కుమార్.