హ్యాపీ.. చిత్రలహరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయితేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్‌మీట్‌లో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఎన్నికల హడావుడి తగ్గి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. సోమవారం నుంచి ప్రాఫిట్ జోన్‌లోకి వెళతామని డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయంగా. రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయని, ఇది కంటిన్యూ అవుతుందనే భావిస్తున్నాం అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ మేం ఏ సక్సెస్‌కోసమైతే కష్టపడ్డామో దాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. అంతా హ్యాపీగా ఉన్నారు. యూత్ సినిమాకు కనెక్టై ఎంజాయ్ చేస్తున్నారన్నారు. సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు, మీడియా సపోర్ట్‌తో సినిమా సక్సెస్ అయ్యింది. నా పాత్రను వాళ్లలో చూసుకుంటున్నట్టు అంతా చెబుతున్నారు. ప్రేక్షకులు వారి ఎమోషన్స్, హ్యాపీనెస్‌ను వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్స్ బావున్నాయి. చాలారోజుల తర్వాత సక్సెస్‌మీట్‌లో కూర్చుంటున్నాను. మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్. ఈ సక్సెస్ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను’ అన్నారు.