ఐరా గైరా.. అంటున్న కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేనొక్కడినే’ అన్న మహేష్‌తో జోడీకట్టి మురిపించిన ముద్దుగుమ్మ కృతిసనన్. తెలుగులో సక్సెస్ గ్రాఫ్ అంతగా లేకున్నా బాలీవుడ్‌లో మాత్రం వరుస చిత్రాలతో మంచి ఊపుమీదే ఉంది కృతి. ఈమధ్యే రాజ్‌కుమార్ రావ్ కెరీర్ గ్రాఫ్‌ను పెంచిన సెనే్సషన్ హిట్టు ‘స్ర్తి’లో ప్రత్యేక గీతంతో మెరుపులు చూపించింది. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘కళంక్’ సినిమాలో బక్కపల్చని అందంతో రెచ్చిపోయి పాటతో ప్రాజెక్టుకే ఊపు తీసుకొచ్చిందట కృతి. హీరోలు వరుణ్ ధావన్, ఆదిత్యరాయ్ కఫూర్‌లతో కలిసి కృతి స్టెప్పులేసిన పాట వీడియోను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ‘ఐరా గైరా..’ అంటూ సాగే అమితాబ్ భట్టాచార్య అల్లరి పాట శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. ఫుల్‌జోష్‌తో సాగిన పాటకు ప్రీతమ్ సంగీతం సమకూర్చాడు. భారీ సెట్టింగులతో అంచనాలు రేకెత్తిస్తోన్న కళంక్ చిత్రంలో ఆలియా, వరుణ్, ఆదిత్యరాయ్, సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్‌లు ప్రధాన పాత్రధారులు. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఓ ఊపు ఊపేస్తున్న కళంక్ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లకు రానుంది.