ట్రిపుల్ ఆర్‌లో ప్రభ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ను నాలుగేళ్లు లాక్ చేసిన రాజవౌళి, ఇంకా వదల్లేదట. తాజాగా జక్కన్న తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్‌లోనూ ప్రభాస్‌ను భాగం చేశాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ పోషిస్తున్న అలూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను పరిచయం చేసేది ప్రభాస్ వాయిస్ ఓవరే అన్నది తాజా సమాచారం. అంతేకాదు, ఓ పాత్రలో ప్రభాస్ కూడా కనిపిస్తాడట. ఇదేకనుక నిజమైతే -ట్రిపుర్ ఆర్‌ను జక్కన్న మరోకోణంలో పైకి లేపుతున్నాడన్న మాట. ఒకే సినిమాలో తారక్, చరణ్, ప్రభాస్ కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఫ్యాన్స్‌కి పండగే. ఇటీవలే షూటింగ్‌లో గాయపడిన చరణ్ విశ్రాంతిలో ఉండటంతో షూటింగ్ వాయిదా పడింది. చరణ్ కోలుకోగానే శరవేగంగా షూటింగ్ నిర్వహించేందుకు జక్కన్న రంగం సిద్ధం చేశాడని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక ప్రాతలో కనిపించనున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్ చిత్రం వచ్చే జూన్ 30న ఆడియన్స్ ముందుకు రానుంది.