నిర్మాతగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార సన్నీలియోన్‌ని బిగ్‌బాస్ షో స్టార్‌ని చేసింది. ఆ తరువాత ‘జిస్మ్-2’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రసిక హృదయాలని కొల్లగొట్టి క్రేజీ భామగా మారింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సన్నీలియోన్ హవానే జోరుగా కొనసాగుతోంది. ఆమెతో సినిమాలు చేయడానికి ఇంకా దర్శక నిర్మాతలు క్యూలో వెయిట్ చేస్తున్నారు కూడా. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న ఈ భామ ఇకపై నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని బాగానే ఫాలో అయినట్టుంది. ఇప్పుడు తన గ్లామర్‌కు క్రేజ్ వుంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఓ చిత్రాన్ని నిర్మించి నటించేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పింది.