హీరోగా ఓ జోల్టంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పెతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చిత్రలహరి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇటీవల విడుదలైన సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. హీరోకి మిత్రుడిగా ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించిన సునీల్ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు.

గ్లాస్‌మేట్‌గా తేజ్‌తో కనిపించినా, రియల్ లైఫ్‌లో చాలామందే ఉన్నారు. మందే కాదు, మజ్జిగ తాగినా గ్లాస్‌మేటేగా.
ఏదైనా త్రివిక్రమ్‌కి చెప్పాలనిపిస్తుంది. బేసిక్‌గా తను ఫ్రెండే కాదు, నాకు టీచర్ కూడా. ఎవరైనా బాధల్లో వుంటే ధైర్యం చెబుతాడు. తనతో పరిచయం బాల్యంనుంచే.
నాకు తెలిసి నేనెవర్నీ ఏడిపించింది లేదు. నవ్విస్తూ కెరీర్‌ని నడిపిస్తున్నా. రీసెంట్‌గా ఒకరు నేను చనిపోయినట్టు యూట్యూబ్‌లో పెట్టారు. కేవలం రేటింగ్ కోసం. ఇది చాలా బాధాకరం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే.. అతను ‘సారీ..’ అన్నాడు. వదిలేశాను. అతన్ని అరెస్టు చేయించి ఇబ్బందిపెడితే నాకేం వస్తుంది.
మనం ఫెయిలైతే హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ. సక్సెస్ కొడితే పొగిడేవాళ్లూ అంతే. మనకిమనమే పవర్‌ఫుల్ అనుకోకపోతే బతకలేం. కానీ ఎప్పటికీ చుట్టూవున్న సిట్యుయేషనే పవర్‌ఫుల్. అదే మన అవసరాలు నిర్ణయిస్తుంది.
గెలుపోటములు దేవుడు నిర్ణయించడు. మనం పెట్టుకున్న గేమ్ ఇది. నెగ్గినవాడిని ఎంకరేజ్ చేయకున్నా ఫర్వాలేదు. పడిపోయినోడిని ఇంకా లాగేయకూడదు. అదీ నా పాలసీ.
ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరో అయ్యాను. ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే అదృష్టమేమంటే -ఎవ్వరితోనూ అనుబంధం తెగిపోలేదు. ఏదోరకంగా నాకు హెల్ప్ చేశారు.
హీరోగా ఓ జోల్డ్ ఇచ్చేందుకు ప్రయత్నించా. నేను సిన్సియర్‌గానే ట్రై చేశాను. అందాల రాముడు సక్సెస్ తర్వాత కమెడియన్‌గానూ చేసుకుంటూ వచ్చాను. కానీ దర్శక నిర్మాతలు కమెడియన్ పాత్రలకు నన్ను అప్రోచ్ కావడం క్రమంగా తగ్గించేశారు.
తేజు సినిమాల్లోకి రాకముందే పరిచయం. ఇన్నాళ్లకు కలిసి పనిచేసే చాన్స్ వచ్చింది.
నా తదుపరి సినిమా బన్నీ, త్రివిక్రమ్‌తో చేస్తున్నా. మరో రెండు సినిమాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. మరో పెద్ద స్టార్ సినిమాలోనూ నటించబోతున్నా అన్నారు.