పాటల్లో ప్లానింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేందర్- మమత కులకర్ణి హీరో హీరోయిన్లుగా బిఎల్ ప్రసాద్ దర్శకత్వంలో టివి రంగసాయి నిర్మించిన సినిమా -ప్లానింగ్. అలీషా ప్రత్యేక పాత్ర పోషించారు. ఉదయ్‌కిరణ్ సంగీతం సమకూర్చారు. నిర్మాత సి కళ్యాణ్ సీడీలు ఆవిష్కరిస్తే, రామసత్యనారాయణ, లయన్ సాయివెంకట్, దర్శకుడు భానుకిరణ్, సంజయ్ తదితరులు పాటల్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి సి కళ్యాణ్ మాట్లాడుతూ ఆడియో బావుంది. విజువల్స్ బాగా వచ్చాయి. చిన్న సినిమా అయినా చక్కని ప్లానింగ్‌తో రంగసాయిశెట్టి, ప్రసాద్ పనిచేశారు. కొరియోగ్రఫీ నుంచి వచ్చిన యువతరం హీరో మహేంద్ర మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు, చక్కడా డ్యాన్సులూ చేశాడు. నటిగా తనను నిరూపించుకునే అవకాశం హీరోయిన్‌కు దక్కింది. రంగసాయి మరిన్ని చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. నిర్మాత రంగసాయి మాట్లాడుతూ వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్, స్నేహితులకు ధన్యవాదాలు. దర్శకుడితో ప్రతి సన్నివేశం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నా. కథ పూర్తయ్యాయే సంగీత దర్శకుడు పాటలు అందించాడు. ఆర్యన్ కెమెరావర్క్ అద్భుతం. మహేందర్, అలీషా ఎంతో సహకరించారు. మంచి సినిమా చేశామన్న సంతృప్తి ఉంది అన్నారు. చక్కని సంగీతం విని ఆస్వాదించాలని సంగీత దర్శకుడు ఉదయ్‌కిరణ్ కోరారు.