శిరీష్‌కు ఓ కొత్త టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ హీరోగా డి సురేష్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ -ఏబీసీడీ. అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి ట్యాగ్‌లైన్. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయవౌతోన్న సినిమాను మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. మే 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ చేతులమీదుగా థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈసందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘జల్సా’ టైంలో శిరీష్‌ను కుర్రాడిగా చూశా. నాకు తెలిసి సినిమాలపై అండర్‌స్టాండింగ్ ఉన్నవాళ్లు తక్కువమంది ఉంటారు. ఆ తక్కువమందిలో శిరీష్ ఒకడు. సినిమాను అర్థంచేసుకుని ప్రేమించే వ్యక్తి తను. తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేమించేవాళ్లు ఎక్కువ సినిమాలు చేయడంవల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్ బాగానచ్చింది. ఇద్దరు డబ్బున్నవాళ్లు కష్టాలుపడితే మనకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది. ట్రైలర్ చూశాక సినిమా కచ్చితంగా హిట్టవుతుందని అనిపిస్తుంది. కానె్సప్ట్ సినిమాలను తీసే మధుర శ్రీ్ధర్‌కు ఇది మంచి ఫలితాన్నివ్వాలని ఆశిస్తున్నా అన్నారు. మధుర శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ సీరియస్ కానె్సప్ట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసే నేను, ఓ ఫన్ మూవీని ప్రొడ్యూస్ చేయాలని చాలారోజులుగా అనుకున్నా. ఆక్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారన్నారు. దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్. ఆయన ఎప్పటికీ నా హీరో. అలాగే జర్నీలో ముందునుంచీ భాగమై నాతో ట్రావెల్ చేస్తున్న నిర్మాత మధుర శ్రీ్ధర్, యష్ రంగినేని, రుక్సన్‌లకు థాంక్స్’ అన్నారు. రుక్సన్ థిల్లాన్ మాట్లాడుతూ చాలా ఫన్, థ్రిల్లింగ్, ఎగ్జయిట్‌మెంట్ ఉండే సినిమా ఇది. శిరీష్ సెట్స్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఎంకరేజ్ చేశాడు. గ్రేట్ కోస్టార్ అంది. అల్లు శిరీష్ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సినిమా గురించి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎక్కువగా మాట్లాడుతా. ఈ సందర్భంగా నిర్మాతలు, నన్ను బాగా ప్రజెంట్ చేసిన టెక్నికల్, నాన్ టెక్నికల్ టీంకి కృతజ్ఞతలు అన్నారు.
ప్రధానాంశమైన లవ్.. ఫ్రెండ్షిప్.. కామెడీ షాట్స్‌తో కట్ చేసిన ఏబీసీడీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ గొప్పింటి ఎన్నారైగా భారత్‌కు వచ్చిన హీరో ఇక్కడ మధ్యతరగతి జీవితం గడపలేక ఎలా సతమతమయ్యాడు? ఇక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదర్కొన్నాడు? అన్న సీడ్‌తో డిజైన్ చేసిన స్టోరీ. ‘హాయ్ నా పేరు అవి. జీవితంలో మూడు ‘ఈ’లు ఫాలో అవుతాను. ఎంజాయ్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎగ్జైట్‌మెట్’ అంటూ శిరీష్ చెప్పిన డైలాగ్‌తో పాత్ర స్వభావాన్ని ముందుగానే ఆడియన్స్‌ను పరిచయం చేశారు. ‘డాడ్. నువ్వు స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. రిచ్‌గా పుట్టాను. రిచ్‌గా పెరిగాను. రిచ్‌గానే ఉంటా’నంటూ ట్రైలర్ చివర్లో శిరీష్ చెప్పిన డైలాగ్ చూస్తే -్ఫదర్.. సన్ బాండింగ్ ఎపిసోడ్ ప్రధానం కావొచ్చని అర్థమవుతుంది. కోట శ్రీనివాసరావు, శుభలేక సుధాకర్, రాజా, మాస్టర్ భరత్, నాగబాబు, వెనె్నల కిషోర్ చిత్రంలో కీలక పాత్రల్ని పోషించారు. ఎన్నికలు, పెద్ద చిత్రాల కారణంగా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఏబీసీడీ -ఎట్టకేలకు మే 17న థియేటర్లకు రానుంది.